కోడూరులో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
కోడూరులో ఘనంగా బీజేపీ సంబరాలు కోడూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడి 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో అనారోగ్య బాధితులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని టోల్గేట్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహం వద్ద నరేంద్ర మోడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.