యువత అంతా స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ గౌతమి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీదేవి అన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద జయంతి (యువజన దినోత్సవం) ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి పూజలు చేశారు. వివేకానంద ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున, వై పీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.