సిరిసిల్ల: టీకా వికటించి చిన్నారి మృతి పై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: RDO రాధా బాయ్
పసి పాప విజయలక్ష్మి టీకా వికటించి మృతి చెందిన సంఘటనలో బాధిత కుటుంబ సభ్యులు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. తంగళ్ళపల్లి మండలం, నేరెళ్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే 45 రోజుల చిన్నారి విజయలక్ష్మి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.న్యాయం చేయాలని చిన్నారి బాధిత కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించగా పోలీసులకు చిన్నారి కుటుంబ సభ్యులకు వాగ్వివివాదం చోటుచేసుకుంది. కలెక్టర్ రావాలని భీష్మించి కూర్చున్నారు. దీంతో సంఘటన స్థలానికి ఆర్డిఓ రాదాబాయి