కావలిలోని 17వ వార్డు గిరిజన కాలనీకి తాగునీటిని సరఫరా చేయాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం గిరిజనులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ మేనేజర్‌కు వినతి పత్రం ఇచ్చారు. 100 కుటుంబాలు ఉంటున్న కాలనీలో పదేళ్లుగా నీటి సమస్య ఉందని, అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని ఆరోపించారు.