గుంటూరు: వర్షాల నేపథ్యంలో త్రాగు నీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
Guntur, Guntur | Sep 17, 2025 గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణ నది నీటిలో బురద శాతం అధికంగా ఉందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కావున నగర ప్రజలు జిఎంసి సరఫరా చేసే త్రాగు నీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించారు. వర్షాల వలన కృష్ణానదికి వచ్చే వరద నీటిలో బురద శాతం అధికంగా ఉన్న నేపథ్యంలో నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ లో నీటి ఫిల్టరేషన్ పై అధిక శ్రద్ధ తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ల వద్ద నుండి నీరు సరఫరా జరిగే సమయంలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు.