మరమత్తుల కారణంగా రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న రైల్వే గేటును బుధవారం రాత్రి మూసివేశారు. రాత్రి నుంచి నిరవధికంగా పనులు చేపట్టారు. గురువారం ఉదయం కూడా పనులు కొనసాగాయి. దీంతో వాహనదారులు బైపాస్ రోడ్డు గుండా రాకపోకలు సాగించారు. అయితే రైల్వే అండర్ బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున నీరు నిలిఘచి గుంతల మయంగా మారడంతో ఇబ్బంది పడ్డారు. ఉదయం 9 వరకూ గేటు తెరిచే అవకాశాలు లేవని రైల్వే అధికారులు తెలిపారు.