ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతీ గురు,శుక్రవారాలలో ఉల్లి కొనుగోలు చేస్తాం: ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు ప్రారంభం ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతీ గురు, శుక్రవారాలలో ఉల్లి కొనుగోలు చేస్తామని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతనే కోత కోయాలని రైతులకు సూచించారు. పండిన ఉల్లిని గ్రేడింగ్ చేసి, ఆరబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డుకు తీసుకురావాలన్నారు. తీసుకువచ్చిన పంటకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేశారు.