శ్రీకాకుళం: సిగిరి కొత్తపల్లిలో భర్త ఇంటి ముందు తన బి 8డ్డతో పాటు న్యాయ పోరాటం చేసిన ఓ భార్య
తనకు, తన బిడ్డకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని బుధవారం భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటం చేసింది. శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, శిగిరికొత్తపల్లికి చెందిన ఎర్ర శంకర్ రావు,మంగమ్మ 2021 లో ప్రేమ పెళ్ళి చేసుకోగా మూడేళ్ల బాలుడు వున్నాడు.ఇటీవల భార్య, భర్తల విభేదాల కారణంగా భార్యా కుమారుడిని విడిచిపెట్టి శంకర్రావు ఎటో వెళ్ళిపోయాడు. దీంతో న్యాయం కొసం భర్త ఇంటి ముందు భార్య, తమ బాబు తో బైఠాయించారు..