బూటకపు మాటలతో తప్పించుకోకు పేర్ని నానీ అంటూ విమర్శించిన బందరు 6వ డివిజన్ TDP ఇన్ఛార్జ్ దిలిప్ కుమార్
Machilipatnam South, Krishna | Sep 17, 2025
వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని స్తానిక మచిలీపట్నం శ్రీ రంగనాయకస్వామి దేవస్థానం భూములను దోచుకున్నదే కాకుండా బూటకపు మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మచిలీపట్నం 6వ డివిజన్ TDP ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ బుధవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో టిడిపి కార్యలయంలో విమర్శించారు. విశ్వేశ్వరస్వామి ఆలయ భూముల సేల్ కన్ఫర్మేషన్ 20 రోజుల్లో వస్తే రంగనాయక స్వామి ఆలయ భూముల సేల్ కన్ఫర్మేషన్ రావడానికి మూడేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. భూముల్లో ఉన్న HT లైన్లను ఎవరు ఏవిధంగా తొలగించారని ప్రశ్నించారు.