గుత్తిలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. జన విజ్ఞాన వేదిక సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అందరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.