గంగాధర నెల్లూరు: రేపు పాలసముద్రంలో ఎమ్మెల్యే థామస్ పర్యటన
పాలసముద్రం మండలంలో ఎమ్మెల్యే థామస్ మంగళవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం సోమవారం తెలిపింది. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. రెండు గంటలకు వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం ఎస్సీ కాలనీ, ఎస్ ఆర్ ఆర్ కండ్రిగ, ఆర్ కె విబీ పేట గ్రామాలలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలియజేశారు.