రాజ్యాంగ దినోత్సవ జోనల్ పోటీలకు అన్నమయ్య జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థినిలు ఎంపిక
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న జోనల్ స్థాయి పోటీలకు అన్నమయ్య జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి రవి తెలిపారు. బుధవారం జరిగిన జిల్లా స్థాయి పోటీలలో రాయచోటి జూనియర్ కళాశాలకు చెందిన మిస్పా, బాలికల జూనియర్ కళాశాలకు చెందిన అఫ్సా, గుర్రంకొండ జూనియర్ కళాశాలకు చెందిన హారిక ప్రతిభ కనబర్చి ఎంపికైనట్లు ఆయన వివరించారు.ఈ నెల 7వ తేదీన జరగనున్న జోనల్ స్థాయి పోటీలకు ఈ ముగ్గురు విద్యార్థినులను పంపనున్నట్లు విద్యాధికారి తెలిపారు.