ఇబ్రహీంపట్నం: బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాంటీన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ లోని ఎన్జీవోస్ కాలనీ స్వామి వివేకానంద పార్కు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ ను కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇందిరమ్మ క్యాంటీన్లో లబ్ధిదారులకు సబ్సిడీతో అల్పాహారం మధ్యాహ్నం భోజనం అయిదు రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ మధ్యకాలం భోజనంతో డివిజన్లో పేదలు అడ్డా కూలీలు ఆటోడ్రైవర్లు తిరువ్యాపారులు అల్పాతాయ వర్గాల వారు నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని కార్పొరేటర్ తెలిపారు.