ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పూలమాల వేసే ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్త రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.