రాజేంద్రనగర్: మణికొండ పరిధిలో వైన్ షాపుల లైసెన్స్ రద్దు చేయాలంటూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానికుల ఆందోళన
మణికొండ పరిధిలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో 100 మీటర్ల దూరంలో ఉన్న వైన్ షాపు, బార్లు, హోటళ్ల వలన రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.