జమ్మలమడుగు: కమలాపురం : యోగివేమన విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని యోగి వేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ 9 ఆధ్వర్యంలో ఒక వారం పాటు నిర్వహించిన ప్రత్యేక శిబిరం విజయవంతమైందని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ శాఖకు చెందిన సి నారాయణ రెడ్డి, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు