ఇబ్రహీంపట్నం: మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిశీలించిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో అధికారులతో కలిసి కార్పొరేటర్ తో కల శ్రీనివాస్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో ప్రధానంగా నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటే సమస్య ఇంత తీవ్రతరం కాదని అన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు.