తాడిపత్రి లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శనివారం ప్రజా దర్బార్ ను నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. కొన్ని సమస్యలను ఎమ్మెల్యే అధికారుల చేత పరిష్కారం చేయించారు. మరి కొన్ని సమస్యలను దశలవారీగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.