ములుగు: తాడ్వాయి – ఏటూరునాగారం అభయారణ్యంలో అడవి దున్నల పొట్లాట, వీడియో వైరల్
Mulug, Mulugu | Sep 16, 2025 తాడ్వాయి – ఏటూరునాగారం అభయారణ్యంలో నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు రెండు అడవి దున్నలు పోట్లాడుకుంటున్న దృశ్యాలు అటవీ శాఖ అధికారుల కెమెరాకు చిక్కాయి. దున్నలు రెండు రంకెలేస్తూ పోట్లాడుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభయారణ్య పర్యటనకు వెళుతున్న పర్యాటకులు అడవి దున్నలు ఉంటాయి కనుక జాగ్రత్తగా వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు.