ఇప్పటివరకు కొండపి నియోజకవర్గం లో 1245 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.9.75 లక్షలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది పేదల ప్రభుత్వమని బాల వీరాంజనేయ స్వామి అన్నారు.