నిర్మల్: జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ సాగర్ కాలనీలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం ఏడుగురు మహిళలతోపాటు ఓ చిన్నారిపై దాడి
Nirmal, Nirmal | Sep 16, 2025 నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ సాగర్ కాలనీలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురు మహిళలతోపాటు ఓ చిన్నారిని గాయపరిచింది. మంగళవారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధులు, మహిళలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు. పిచ్చికుక్క కాలనీలో దాడికి పాల్పడుతుండడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడదతో ప్రజలను కాపాడాల