కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నాగులకట్ట హాస్టల్ వద్ద 2017 జనవరి 19న జరిగిన హత్య కేసులో తండ్రి కూతురులిద్దరికి జీవిత ఖైదు శిక్షను ఎస్సి, ఎస్టి కం అడిషినల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ధీనబాబు విధించారని జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేష్ బాబు తెలిపారు.గురువారం తెల్సిన వివరాల మేరకు ఆయన వివరాలు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన హత్య కేసును మృతుడు మునగాల రవి భార్య గంజి పద్మావతి తన భర్తను లక్కిరెడ్డి సూర్య నారాయణరెడ్డి, మాధవి హత్య చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అప్పటి సిఐ నాగరాజు డిఎస్పి సర్కార్ ఆదేశాలతో అరెస్ట్ చేశారన్నారు.