కోడుమూరు: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన కోడుమూరు ఎమ్మెల్యే, ప్రమాద బాధితులకు పరామర్శ
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి బుధవారం బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. సి.బెలగల్ మండలంలోని పలుకుదొడ్డి గ్రామానికి చెందిన నాగేంద్ర కుటుంబ సభ్యులకు మంజూరైన రూ .1,96,703 బాలాజీ నగర్ కు చెందిన ముబీనా బేగం కు మంజూరైన రూ.20 వేల చెక్కును బాధితులకు ఎమ్మెల్యే అందించారు. కాగా పులకుర్తి గ్రామానికి చెందిన ముల్లా రహిమాన్ తన భార్యతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఆటో ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే బాధితులను పరామర్శించారు.