అసిఫాబాద్: దుబ్బగూడ గ్రామం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వీంటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్,శ్రీనివాస్ లు తెలిపారు. సిర్పూర్ టి మండలం దుబ్బగూడ వద్ద బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అబ్దుల్ జాకిర్ చెందిన ఆటోలో 7 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఆటో డ్రైవర్ ఆటోను వదిలి పెట్టి పారిపోయినట్లు తెలిపారు