నాయుడుపేటలో వైసిపి కోటి సంతకాల సేకరణ
- టౌన్ లోని 01, 02 వార్డుల్లో పర్యటించిన మాజీ mla కిలివేటి సంజీవయ్య
వైద్య విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని 01వ వార్డు తుమ్మూరు, 02వ వార్డు భరత్ నగర్, ఓజిలి మండలంలోని వినుగుంట, అర్మేనిపాడు గ్రామాలలో వైయస్ఆర్సీపీ నాయకులతో కలిసి కిలివేటి సంజీవయ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఈ ఉద్యమం అవసరాన్ని వివరించారు. చంద్రబాబు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరిస్తూ, ప్రజ