కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
- తడ (మం) వాటంబేడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కుంబాభిషేకం
తిరుపతి జిల్లా తడ మండలం వాటంబేడు గ్రామపంచాయతీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో చేపడుతున్న మహా కుంభాభిషేక కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి చేసిన ఎమ్మెల్యే దంపతులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ పార్థసారథి దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.