ఇబ్రహీంపట్నం: ప్రముఖ కవి అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రముఖ తెలంగాణ కవి అందెశ్రీ ఈరోజు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందెశ్రీకి తగిన గుర్తింపు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు.