మార్కాపురం: భార్య చేతులను కట్టివేసి విచక్షణరహితంగా కొట్టిన భర్తపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన డిఎస్పి లక్ష్మీనారాయణ
ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం కలుజువ్వలపాడు లోని జగనన్న కాలనీలో భార్య చేతులను కట్టివేసి విచక్షణ రహితంగా కొట్టిన భర్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసినదే. ఈ సమాచారం తెలుసుకున్న దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ పొదిలి సిఐ వెంకటేశ్వర్లు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. భర్త బాలాజీ నాలుగేళ్ల కిందట చీరాల వెళ్లి అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు సొంతూరు వచ్చి భార్యను బెదిరించి నగదు తీసుకొని వెళ్తుండేవాడు. సెప్టెంబర్ 13వ తేదీ శనివారం భార్య నగదు ఇవ్వకపోవడంతో విచక్షణ రహితంగా కొట్టాడని పోలీసులు తెలిపారు.