పాలకొల్లు: యలమంచిలి మండలం కడింపుంతలో ఓ ఇంటిపై కత్తులు, గోడ్డలతో కొందరు దాడి, సీసీ కెమెరాల్లోరికార్డ్ అయిన దృశ్యాలు, నలుగురు అరెస్ట్
యలమంచిలి మండలం కడింపుంతలో మామిడిశెట్టి బెన్ని పాల్ ఇంటిపై తుంగ నాగేశ్వరావు తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. పాత వివాదాల కారణంగా బుధవారం ఉదయం కత్తులు, గోడ్డలతో రెండు కార్ల అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి తలుపు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకునేలోపు దుండగులు పరారయ్యారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా నాగేశ్వరావు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన స్థలాన్ని సిఐ శ్రీనివాస్ ఉదయం 10 గంటలకు పరిశీలించి సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. రౌడీలతో దాడి చేసిన నాగేశ్వరావు వల్ల ప్రాణహాని ఉందని బాధితులు పోలీసుల రక్షణ కోరుతున్నారు.