నారాయణపేట్: వయో వృద్ధుల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట జిల్లాలో ఈనెల 12 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు నిర్వహించే వయో వృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలని పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారము జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం లోని కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి వయో వృద్ధుల వారోత్సవాల వాల్ పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధులు వారోత్సవాలలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.