యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Nov 5, 2025
యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు ఒక సువర్ణ అవకాశమని యువత తాము నైపుణ్యం కలిగిన రంగాలలో ప్రతిభను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన యువజన ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ,నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి , సెట్కూరుసీఈవో డాక్టర్ కే వేణుగోపాల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.