అవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా క్యాంప్ డాక్టర్ అభియాన్
నంద్యాల జిల్లాఅవుకు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 24న మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అభినయ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్త్ నారీ-స్వశక్త్ పరివార్ అభియాన్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, పోషకాహార ఆవశ్యకత గురించి వివరించడం జరుగుతుందన్నారు. 10 మంది డాక్టర్లు వచ్చి చికిత్స అందిస్తారన్నారు.