అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ నిర్వహించారు. "ప్రజా దర్బార్" కార్యక్రమంలో ప్రజలు, నాయకుల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.