మంత్రాలయం: పెద్ద కడబూరు లోని ఎస్సీ కాలనీలో ఒకటో వార్డులో కొన్ని కుటుంబాలు తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్
పెద్ద కడబూరు :లోని ఎస్సీ కాలనీలో ఒకటో వార్డులో కొన్ని కుటుంబాలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడేవి. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రామాంజనేయులు ఆ కుటుంబాలకు ప్రత్యేక పైపులైన్ వేసి వాలు బిగించి తాగునీటి సమస్య ను పరిష్కరించారు. దీంతో ఆ కుటుంబాల ప్రజలు సర్పంచ్ రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శి సాయి తేజకు బుధవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో వైసీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొగ్గుల అర్లప్ప ఉన్నారు.