మహిళను మోసం చేసిన ముద్దాయికి కఠిన శిక్ష
ఓబులవారిపల్లి మండలానికి చెందిన మహిళను మోసం చేసిన దాంత్ల విజయ్ కుమార్ (42)కు జీవిత ఖైదు, రూ.80 వేల జరిమానా విధిస్తూ కడప VII ADJ కోర్టు తీర్పు వెలువరించింది. 22 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన తర్వాత తాళిబొట్టు, మెట్టెలు లాక్కొని, గర్భంలోని శిశువును చంపేస్తానని బెదిరించిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది.విచారణ అనంతరం న్యాయమూర్తి జి.ఎస్. రమేష్ కుమార్ గారు కఠిన శిక్ష విధించారు. కేసు దర్యాప్తులో పోలీసుల కృషి, ప్రాసిక్యూషన్ బృందం పాత్రను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ అభినందించారు. మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు కొనసాగుతాయ