ద్విచక్ర వాహనాన్ని అపహరించి ఆపై ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేసిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి సమయంలో రవి అనే వ్యక్తి తన ఇంటి ముందు ద్విచక్ర వాహనాన్ని ఉంచి ఇంటిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. శుక్రవారం ఉదయాన్నే ద్విచక్ర వాహనం అపహరణకు గురైందని గుర్తించిన బాధితుడు ద్విచక్ర వాహనాన్ని వెతుకుతూ గ్రామ పరిసర ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ రవి ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లు కనిపించాయి. మంటల్లో పూర్తిగా ద్విచక్ర వాహనం కాలిపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక చేశాడు.