కాకినాడ జిల్లాలో దంచి కొడుతున్న వానలు ఫీవర్ ఇబ్బందులు పడుతున్న ప్రజలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లాలోని గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాకినాడలోని భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా వర్షంతో ప్రధాన రహదారులు నీట మునిగాయి. చిన్నపాటి వర్షానికే కాకినాడ నగరం నేత ములుగుతుంది రెండు గంటల పాటు ఏకతాటిగా కురిసిన వర్షంతో కాలువలు నిండు పొంగుతున్నాయి. మరో రెండు రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.