ఆందోల్: మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దామోదర రాజనర్సింహ
మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి తో కలిసి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పావలా వడ్డీకి మహిళా సంఘాలకు రుణాలు అందించాలని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు.