హిమాయత్ నగర్: సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లోకి చోరబడి కత్తులతో బెదిరించి 40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్ లో దోపిడి కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక ఇంట్లో ఇద్దరు దుండగులు చొరబడి కత్తులతో బెదిరించి 40 లక్షల నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం చేరుకొని ఘటనను పరిశీలించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.