ఇబ్రహీంపట్నం: మియాపూర్ డివిజన్ పరిధిలో స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీలా గార్డెన్ కాలనీలో కాలనీవాసులు నిర్వహించిన సమావేశంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో మాట్లాడే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని అలాగే తాగునీటి సమస్య రోడ్ల సమస్య ఉన్నాయని తెలిపారు. స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎటువంటి సమస్యలున్నా తెలియజేయాలని అన్నారు.