ఆందోల్: మహిళల వ్యాపార విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది: సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణం పాత డిఆర్డిఏ లో మంగళవారం, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలారెడ్డి 314.31 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల వ్యాపార విస్తరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళలు స్వయం ఉపాధితో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావిణ్య కూడా పాల్గొన్నారు.