ఆరోగ్యవంతులైన మహిళలతోనే బలమైన కుటుంబం సాధ్యం : జాయింట్ కలెక్టర్
ఆరోగ్యవంతులైన మహిళలతోనే బలమైన కుటుంబం అనే నినాదంతో స్వస్థ నారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వనస్థలి తెలిపారు తిరుపతి అర్బన్ నరసింహ తీర్థం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు స్వస్థనారి సొసైటీ పరివార్ అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు ఇందులో పాల్గొని మాట్లాడారు.