ఖమ్మం అర్బన్: అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అంధులకు స్కూల్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి జెడ్పీ సిఈఓ., విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు.