సూళ్లూరుపేటలో నూతన ఇరిగేషన్ భవనం ప్రారంభం
- రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని DOS కాలనీ సమీపం లో నూతనంగా ఇరిగేషన్ కార్యాలయ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నూతనంగా నిర్మించిన ఇరిగేషన్ భవనాన్ని బుధవారం MLA నెలవల విజయశ్రీ చేతులు మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యాలయంలోని అన్ని వసతులను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చక్కగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.