సంగారెడ్డి: పరిమిత వేగంతో ప్రాణాలకు రక్షణ: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్
సంగారెడ్డి పట్టణంలో ఉదయం ఎనిమిది గంటల అయినా కూడా పొగ మంచు వీడలేదని సంగారెడ్డి జిల్లా ప్రజలు పొగ మంచులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అత్యవసరయమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మీడియాతో తెలిపారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరి పొగ మంచు దట్టంగా కమ్ముకొని రహదారులపై ఎదురు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడుతున్నాయని తెలిపారు ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలకు లైట్లు, ఇండికేటర్లు వేసుకొని తక్కువ స్పీడ్ లో వెళ్తేనే ఎదురు వెళ్తేనే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు.