అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఒకటిన్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు గాని చెందిన 27 మందికి 17 లక్షల 50000 ఎల్ ఓ సి తో పాటు 19 మందికి 12 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని భవిష్యత్తులో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే విధంగా తమ వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోస్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.