చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు. డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు
ప్రకాశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ ఉమామహేశ్వర్, ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు మరియు పోలీస్ అధికారులు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నా చెడు నడత (షీటర్స్) కలిగిన వ్యక్తులకు మంగళవారం సాయంత్రం డిఎస్పీ ఆఫీస్ వద్ద కౌన్సెలింగ్ నిర్వహించారు.ఒంగోలు డిఎస్పీ వారితో మాట్లాడుతూ చెడు నడత కలిగిన వ్యక్తులు(షీటర్స్) నేర ప్రవృత్తిని వీడనాడి సద్భుద్దితో జీవించాలని, సత్ప్రవర్తనతో మెలగాలని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించే విధంగా వ్యవహారించవద్దని, గత జీవితాన్ని వదలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, వివాదాలకు దూరంగా ఉండాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు.