జిల్లా మంత్రి స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ రాజాబాబు,అభివృద్ధి ప్రణాళికలపై చర్చ
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని జిల్లా నూతన కలెక్టర్ రాజాబాబు మంగళవారం సాయంత్రం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై ఇరువురు చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమాలకు అనుగుణంగా పనిచేయవలసిందిగా కలెక్టర్ రాజబాబును మంత్రి కోరారు. జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చి తన వంతు తోడ్పాటు అందిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు.