లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాగూడ లో వేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హర్షిత్ రెడ్డి శివమణి యువకులు ఘటనా స్థలంలోని మృతి చెందాలని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.