ఆందోల్: శివంపేట లో పంచాయతీ అధికారులను బంధించిన రైతులు
చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో RRRకు భూసేకరణ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఆస్ఐ ప్రమోద్, జీపీఏ ప్రవీణ్‌ను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారని స్థానికులు తెలిపారు. ఎకరా విలువ రూ.కోటి ఉండగా రూ.16 లక్షలు ఆఫర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న జోగిపేట సీఐ అనిల్ కుమార్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి అధికారులను విడుదల చేశారు. రూ.16 లక్షలకు భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు.